Breaking News

Loading..

పొంగులేటి నీ తీరు మార్చుకో..మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ ..



               బిసిఎం10 న్యూస్ సెప్టెంబర్ 30 భద్రాచలం


భద్రాచలం కాంసెన్సీ పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఎన్నడూ లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకున్నట్లు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఆదివాసి నాయకులు పూనెం ప్రదీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదవ షెడ్యూల్, ఏజెన్సీ ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నదని, ఈ ప్రాంతంలో సర్వహక్కులు గిరిజనులకే చెందుతాయని రాజ్యాంగం చెపుతుంటే, ఎన్నడూ లేని విధంగా దుమ్మగూడెం, టేకులపల్లి మండలాల జడ్ పి టి సి స్థానాలను జనరల్ స్థానంలా కేటాయించడం వెనుక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం ఉందనే అనుమానం కలుగుతుందని, తన అనుచరులైన ఓ సి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని జడ్ పి చైర్మన్ ను చేసేందుకు గిరిజన ప్రజల హక్కులను, అస్తిత్వం, మనోభావాలతో చెలగాటమాడుతున్నాడని తక్షణమే ఇటువంటి ఒంటెద్దు పోకడలు మానుకోకపోతే గిరిజనుల ప్రతాపానికి నువ్వు, నీ ప్రభుత్వం కుప్పకూలేపోయే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు గిరిజన నియోజక వర్గాలు ఉన్నాయని, పార్లమెంట్ స్థానం కూడా గిరిజనులదేనని, అటువంటి ప్రాంతంలో నువ్వు చక్రంతిప్పి గిరిజనుల నోట్లో మట్టికొట్టి, మోసం చేయడంతో నీ పతనానికి నాంది పలికావని, ఇంత జరుగుతున్న శాసన, పార్లమెంట్ సభ్యులు నోరు మెదపడం లేదని, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బానిసలుగా ఉండి జాతికి ద్రోహం చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని, తక్షణమే ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గతంలో లాగానే రిజర్వ్ స్థానాలుగా ఉంచేందుకు ఉద్యమించాలని, లేకపోతే వచ్చే ఎన్నికలలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఏజెన్సీ, మైదాన ప్రాంత తేడా కూడా ఈయనకు తెలియక పోవడం, అధికారులు కూడా దానిని అంచనా వేయకుండా ఆయన చెప్పినట్లు చేస్తున్నారనే మాటలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయని, కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కోసం గిరిజన ప్రజలను, చట్టాలను అపహాస్యం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని, అందుకు తగు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉన్నదని ఆయన అన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి తగు బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.

Post a Comment

0 Comments